నంద్యాల ఫ్యామిలీ సూసైడ్ : ఆ సిఐ సస్పెన్షన్ !

-

కర్నూలు‌ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. పాణ్యం మండలంలోని కౌలూరులో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఒకే సారి సూసైడ్‌ చేసుకున్నారు. నంద్యాల రోజా కుంట ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలామ్ మంగళవారం భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుంచి ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. గూడ్స్‌ రైలుకింద పడి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలామ్ గతంలో ఓ బంగారం దుకాణంలో చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.

ఈ కేసు విచారణ నిమిత్తంతొ పలుమార్లు పోలీసులు విచారించారు. ఈ నేపధ్యంలో ఆత్మహత్య చేసుకున్నారని భావించారు, అయితే వారి ఆత్మహత్యకు ముందు చేసిన ఒక సెల్ఫీ వీడియో బయటకు ఒచ్చింది. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య ఉదంతంపై ఇద్దరు ఐపియస్ లతో విచారణ కమిటీ వేసింది. ఏపిఎస్పీ బెటాలియన్ ఐజి శంకబ్రత బాగ్చి, గుంటూరు అదనపు ఎస్పీ ఆరీఫ్ లను విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది. విచారణ పూర్తయ్యే వరకు నంద్యాల వన్ టౌన్ సిఐ సోమ శేఖర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news