ఎన్ని నష్టాలు జరుగుతున్నా సరే కొందరిలో మార్పు అనేది ఉండదు అనే మాట వాస్తవం. మూర్ఖంగా వ్యవహరిస్తు ప్రాణాలు కోల్పోతున్నారు. నదుల్లో సేల్ఫీలు దిగడం అనేది చాలా మందికి ఇష్టం. కాని వరదలు వచ్చిన సమయంలో కూడా కొందరు వ్యవహరించే విధానం చికాకుగా ఉంటుంది. భారీ వర్షాలు పడి భారీ వరదలు వచ్చినా సరే సేల్ఫీ దిగుతూ ఉంటారు.
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా బేలాఖేడి గ్రామంలో పెంచ్ నది వద్ద ఇద్దరు అమ్మాయిలూ సేల్ఫీ కోసం రాయి వద్దకు వెళ్ళారు. భారీగా వరద రావడంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని తాళ్ళ సాయంతో బయటకు లాగారు. ఈ నేపధ్యంలోనే అదే రాష్ట్రంలోని బర్వాని జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నదుల్లో సేల్ఫీ బాన్ చేసారు. అంతే కాకుండా నదుల వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తున్నామని, ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.