భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 47,704 కరోనా కేసులు నమోదవ్వగా 654 మంది కరోనాతో మరణించారు.
దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 33,425కు పెరిగింది. ఇక భారత్ లో ఇప్పటి వరకు 9,52,744 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,96,988 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.