ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల విషయం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మంత్రి బొత్స సత్య నారాయన మరో సారి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తోందని తెల్చి చెప్పారు. అలాగే శివ రామకృష్ణ కమిషన్ కూడా ఇదే అంశాన్ని సూచించిందని అని అన్నారు. కాగ రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్ష పార్టీ అభిప్రాయాలను తామకు ప్రామాణికం కాదని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమానాంగా అభివృద్ధి జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. అలాగే గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. సొంత ప్రయోజనాల కోసం, స్వార్థంగా పోలవరంతో పాటు ప్రత్యేక హోదా లను కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం పూర్తి గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే పని చేస్తోందని అన్నారు. టీడీపీ లాగ తమ పార్టీకి స్వార్థ ప్రయోజనాలు లేవని విమర్శించారు.