దివంగత ప్రధాని తెలుగు ప్రజల ఠీవి అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు కమిటీ సభ్యుల సమక్షంలో తాజాగా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ను ఆవిష్కరించారు,
ఈ వెబ్ సైట్ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు… పలు వివరాలను కూడా పొందుపరిచి ప్రజలకు అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా ఈ వెబ్సైట్ ను రూపొందించామని కేశవరావు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాలు కార్య స్థలాలు కూడా ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఉంటాయని ఆయన తెలిపారు. జయంతి ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈ వెబ్సైట్లో పొందు పరుస్తాను అంటూ కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు వెల్లడించారు.