ఉత్తర, ఈశాన్య భారతదేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి బిహార్, అసోం, మేఘాలయల్లో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వచ్చే కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ విభాగం.నదులు ఉగ్రరూపం దాల్చడం వల్ల బీహార్ లో తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 14 జిల్లాల్లోని 1012 గ్రామాల్లో 45.39 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలకు ఇదొక అంశంగా దొరికినట్లయింది. వరదల కారణంగా తూర్పు చంపారన్ జిల్లాలో ప్రజలు నిలువు నీడలేకుండా ఇబ్బందులు పడుతుంటే.. కేవలం 19 పునరావాస కేంద్రాలే ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఈ వరదలు మరింత ఇబ్బందిగా మారింది. దీని వలన కరోనా భారిన ఎక్కువ మందికి సోకుతుందని ఆయన తెలిపారు.