ధరణీ వెబ్ సైట్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణీ వెబ్సైట్ లో భారీ మార్పులకు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందు లో భాగంగా నిషేధిత భూములను తొలగించడం తో పాటు కొత్త మాడ్యూల్స్ తో సమస్యలను పరిష్కారించే విధంగా మార్పులు చేయనున్నారు.
ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నిషేధిత జాబితాలో లక్షల ఎకరాల భూములు చేరాయి. వాటిని తొలగించే విధంగా మార్పులు చేయనున్నారు.
వారం రోజుల్లో ధరణి నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు. అలాగే వ్యవసాయ భూమి ల లో ఇళ్లు నిర్మించు కుంటే రైతు బందు ను నిలిపి వేసేలా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ధరనీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ లను రద్దు చేసుకుంటే.. డబ్బులు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీని తో పాటు అన్ని జిల్లా ల లో రైతులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇప్పట నుంచి రైతుల విన్నపాలు సుమోటోగా తీసుకుని పరిష్కరించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.