మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా వద్ద ఉన్న పాలి హిల్ లోని తన భవనాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కూల్చడంపై హీరోయిన్ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన వర్సెస్ కంగనాగా ఈ వ్యవహారం మారిపోయింది. ఇక కంగనా విషయంలో బిఎంసి చర్యను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఖండించారు. సిఎం థాకరే సలహాదారు అజోయ్ మెహతాతో కోష్యారి మాట్లాడారు.
ఇది కచ్చితంగా కక్ష సాధింపుగానే ఉంది అని గవర్నర్ అసహనం వ్యక్తం చేసారు. కూల్చివేత చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి గవర్నర్ ఒక నివేదిక ద్వారా కేంద్రానికి తెలియజేసే అవకాశం ఉంది. కాగా కంగనా నిన్న ముంబై వచ్చిన సంగతి తెలిసిందే. క్కడి నుంచి కూడా ముంబై నుంచి ఆమె వెళ్లిపోవాలి అని డిమాండ్ లు చేస్తున్నారు.