గవర్నర్లు బిజెపి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు డీఎంకే ఎంపీ కనిమొలి. రాష్ట్రాల అధికారాల విషయంలో కేంద్రం తల దూర్చుతుందని ఆరోపించారు. రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తుందని.. తెలంగాణ, కర్ణాటక, నాగాలాండ్, తమిళనాడులో గవర్నర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపరాగాని రాజ్యాంగంలో ఉందని.. అంబేద్కర్ ప్రసంగాలను చదువుకోమని గవర్నర్లకు చెప్పాలని ఆమే చురకలాంటించారు.
హిందీ భాషా తప్పించి దక్షిణాది భాషలు అంటే కొందరికి చిన్న చూపు అంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతకు ముందు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఆరో రోజు రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. ద్రవ్యాలబలం, నిరుద్యోగం, పేదరికం, అదానీ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.