గవర్నర్ ల వ్యవహార శైలి పై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు. బడ్జెట్ ఆమోదించాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ రాలేదని.. తెలంగాణతోపాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.
పార్లమెంట్ లో ఫెడరలిజం గురించి చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పాస్ అయితేనే ప్రభుత్వం నడుస్తుందని గుర్తు చేశారు. బిల్లుల విషయంలో కూడా తరచూ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ తీరును ప్రస్తావించారు. ఇక రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ పై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని కేశవరావు స్పష్టం చేశారు.