అవతార్ దర్శకుడి రికార్డ్ ను కొట్టేవారు లేరు బాస్..!!

-

అవతార్ 2 సినిమా భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుదల అయ్యి ఇప్పటికే 38 రోజులు అయ్యింది. అయినాసరే ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముందు నుండి విడుదల అయిన అవతార్ 1 చూసి ఎంతో మంది అవతార్ 2 కూడా సూపర్ గా ఉంటుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానితో రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.

ఇక మొదటి నుండి ఈ సినిమా త్రీడీ లో చూడాలని అప్పుడే మాత్రమే సినిమా అసలైన ఫీలింగ్ ఇస్తుందని చెప్పడంతో త్రీడీ థియేటర్స్ వీకెండ్ లో  ఇప్పటికీ ఖాళీ ఉండటం లేదు. ఇప్పుడు ఈ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్  సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా 2 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. అలాగే ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసిన 4 వ చిత్రంగా నిలిచింది.

మొదటి స్థానంలో జేమ్స్ కామెరూన్ అవతార్ ప్రపంచ వ్యాప్తంగా 2.92 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.దీని తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ 2.79 బీలియన్ డాలర్స్  గ్రాస్ తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో టైటానిక్2.2 బిలియన్ డాలర్స్  కలెక్షన్స్ తో ఉంది. దీని తర్వాత స్థానంలో అవతార్ 2 మూవీ ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా. 2.074 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని రాబట్టింది అయితే 2 బిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 4 ఉంటే అందులో మూడు సినిమాలు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించినవే కావడం ఈ రికార్డ్ ను కొట్టేవారు దరిదాపులలోకి ఎవరూ వచ్చే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news