ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా – రాహుల్ గాంధీ

-

అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తుగ్లక్ లైన్ – 12 లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. లోక్సభ హౌసింగ్ కమిటీ ఈ నోటీసులను జారీ చేసింది. నిబంధనల ప్రకారం అనర్హుడైన పార్లమెంటేరియన్ ప్రభుత్వ వసతికి అర్హులు కారని నోటీసులలో పేర్కొన్నారు.

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని రాహుల్ గాంధీ లోక్సభ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. అధికారుల ఆదేశాలను తాను తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. ఆ బంగ్లాలో తనకి చాలా ఆనందకరమైన జ్ఞాపకాలు ఉన్నాయని.. కానీ లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని, తన బాధ్యతగా బంగ్లాను ఖాళీ చేస్తానని లేఖలో వెల్లడించారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news