ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు అందనుంది. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ పదోన్నతులు రానున్నాయి. అందుకు సంబంధించిన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సచివాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్లలోని ఉద్యోగులపై కసరత్తు జరుగుతుంది. జనవరి చివరి వరకు పదోన్నతులను పూర్తి చేసిన తర్వాత ఎక్కడెక్కడా మిగిలిన ఖాళీల వివరాలు అందించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు.తెలంగాణలో ప్రస్తుతం 30 ప్రధాన శాఖలు ఉండగా, వాటికి అనుసంధానంగా మరో 40 ఇతర శాఖలు ఉన్నావి. ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పదోన్నతలు రానున్నాయి.
పైస్థాయి నుంచి..
పదోన్నతల విషయంలో ముందుగా పైస్థాయి ఉద్యోగ ఖాళీలను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా కిందిస్థాయి వారికి పదోన్నతలు కల్పిస్తారు. ఒకవేళ సచివాలయాల్లో పదోన్నతలు కల్పించాలంటే ఖాళీగా ఉన్న అదనపు కార్యదర్శుల స్థానంలో సంయుక్త కార్యదర్శులకు పదోన్నతలు కల్పిస్తారు. ఆ తర్వాత సంయుక్త కార్యదర్శుల స్థానాలను ఉపకార్యదర్శులతో వారి స్థానాలను సహాయ కార్యదర్శులతో పూర్తి చేయనున్నారు.
మూడేళ్ల, రెండేళ్ల.?
పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్యోగి మూడేళ్ల కాలం పూర్తి చేసుకుంటేనే పదోన్నతలకు అర్హులు. ఈ విషయమై గత రెండేళ్ల క్రితం ఆయా ప్రభుత్వం సంఘాలు రెండేళ్ల తగ్గించాలని సీఎంను కోరాగా అందుకు ఆయన ఆంగీకరించిన విషయం తెలిసిందే. దాని గడువు గతేడాది జూన్ 5 వరకు ముగిసింది. ప్రస్తుతం పదోన్నతల ప్రక్రియ ప్రారంభం అయింది అయితే.. ఇప్పుడు పదవీకాలం మూడేళ్ల, రెండేళ్లకు చేస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.