కడప జిల్లా పులివెందుల కోర్టులో ఎమ్మెల్సీ బిటెక్ రవిని హాజరు పరచారు పోలీసులు. ఈ క్రమంలో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది పులివెందుల కోర్టు. దీంతో ఆయనని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ని చెన్నై లో అరెస్ట్ చేసి పులివెందులకు తీసుకొచ్చిన పోలీసులు, పులివెందుల్లో ఆసుపత్రికి తరలించి అనంతరం మజస్ట్రేట్ ముందు హాజరు పరచారు పోలీసులు.
2018 లో పులివెందుల పూల అంగళ్ల సర్కిల్ లో జరిగిన అల్ల ర్లు, ఘర్షణ కేసులో బిటెక్ రవి నిందితుడని, అప్పట్లో రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో వారెంట్ పెం డింగ్ ఉందని అందుకే ఇప్పుడు అరెస్ట్ చేశామని చెబుతున్నారు పోలీసులు. నిజానికి తాజాగా నమోదయిన ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ అయ్యానని రవి భావించారు, టీడీపీ నేతలు కూడా అదే భావించారు. కానీ పోలీసులు ఆ కేసు వేరని, ఈ కేసు వేరని తేల్చారు.