రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. తాజాగా ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కోసం 1575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది.సెక్రటేరీయేట్, అసెంబ్లీ, హైకోర్టు, అధికారులు, ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు బంగళాల వంటి వాటికి కేటాయించిన భూమిని నోటిఫై ప్రభుత్వం చేసింది.
మాస్టర్ ప్లాన్ ప్రకారం, జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఏయే గ్రామాల పరిధుల్లోని భూమిని నోటిఫై చేస్తున్నామనే వివరాలను సీఆర్డీఏ గెజిట్లో పెట్టినది.రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల్లోని 1575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ గెజిట్ రిలీజ్ చేసింది.నోటిఫై చేసిన ప్రాంతంలో ఇప్పటికే తుది దశలో కొన్ని భవనాల నిర్మాణాలు ఉన్నాయి.రాజధాని నిర్మాణంలో తొలి విడత పనులు నోటిఫై చేసిన ప్రాంతంలోనే చేపట్టే అవకాశం ఉంది.