మైనర్ బాలిక పై గ్రామ వాలంటీర్ అఘాయిత్యం…!

-

gram volunteer tried to molest a minor girl in tirupati
gram volunteer tried to molest a minor girl in tirupati

ఏపీ లో గ్రామ వాలంటీర్ల నేరాలు పెరిగిపోతున్నాయి. గ్రామ వాలంటీర్లను ప్రజలకు ఉపయోగపడేందుకు నియమిస్తే వారు ఆ ప్రజల పైనే నేరాలకు అఘాయిత్యాలకు సిద్ధమవుతున్నారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న జీతాలు చాలక చోరీలు చేస్తున్నారు. మరి కొందరు తమ వద్దకు వచ్చిన ప్రజల అవసరాలు చూసి లైంగిక దాడులు వేధింపులు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ వాలంటీర్ ఓ మైనర్ బాలిక పై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన తిరుపతి లోని పుంగనూరు మండలం గూడూరుపల్లెలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి లోని పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన గ్రామ వాలంటీర్ నరేశ్ అదే ఊరికి చెందిన ఓ మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించిన వాలంటీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం (నేడు) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఫిర్యాదుకు రెండు రోజుల ముందు నరేశ్ పై కేసు కానివ్వకుండా కాపాడేందుకు ప్రయత్నించారు ఆ గ్రామం వైసీపీ నాయకులు. పంచాయితీ పెట్టి విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news