సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్న బామ్మ.. ఏడాదికి రూ.కోటీ ఆదాయం..!!

-

వ్యాపారం చేయడానికి అనుభవం ఉండాలని చాలామంది పెద్దలు చెప్పే మాట.. అనుభవం ఉండే అన్ని పనులు చేస్తున్నామా..? మొదలుపెడితేనే కదా.. అనుభవం వస్తుంది.. వ్యాపారం అయినా వేరే ఏపని అయినా చేయడానికి మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వం, ఏం జరిగినా తీసుకోగల సత్తా ఉంటే చాలు.. పెట్టుబడి అక్కర్లేదా అని మీరు అడగొచ్చు..ఇవి లేకుండా మీరు కోట్లుపెట్టి వ్యాపారం చేసినా లాభం రాదు..అయితే.. 65 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు..

ఇంటి దగ్గరే కుర్చోని..అనారోగ్యంతో…కాలం వెల్లదీస్తారు.. ఆ వయసుకు వచ్చే సరికి.. చాలామంది వృద్ధులు ఒంటరి అయిపోతారు.. కొడుకు, కూతురికి భారంగా ఉంటారు..ఈ మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ.. గ్రౌండ్‌ లెవల్‌లో జరిగేది ఇదే..! ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్‌ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు వెనకేస్తుంది.. ఏంటీ షాక్‌ అయ్యారా..?
అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో వెంటనే చూసేద్దాం..!

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్‌బీన్ దల్‌సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ బతికింది.. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఆమెకు ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది అయ్యింది..

అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమెకు 11 లక్షల రూపాయల ఆదాయం వస్తోందట.. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్‌బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తారు… వారందరికి నెల జీతం రూ. లక్షన్నర. ఖర్చులు అన్నీ పోనూ నవాల్‌బీన్‌ వ్యాపారం లాభాల్లో నడుస్తుంది..

మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆరుపదుల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. డబ్బు సంపాదించాలంటే..ఏంబీఏలు, ఏంటెక్‌లే చేయక్కర్లేదు..! నాలుగు గేదలు పెంచుకుంటూ కూడా దర్జాగా బతకొచ్చు..! అలా అనీ చదువుకున్న వాళ్లను తక్కువ చేస్తున్నట్లు కాదు.. చాలామంది.. తాము ఉద్యోగం చేయడం లేదు, ఏ ఉద్యోగం రావడం లేదు అని బతుకుమీద నిరాశగా ఉంటారు.. అలాంటి వారు.. ముద్రలోన్‌ తీసుకోని ఏదైనా చిన్న వ్యాపారం ఇలాంటిది మొదలుపెడితే మీకు మీరే బాస్‌ అవ్వొచ్చు.. ఎందుకు ఎప్పుడూ ఒకేలా ఆలోచించాలి.. కార్పొరేట్‌ జాబుల్లో ఎప్పుడు తీసేస్తారో తెలియదు.. గవర్నమెంట్‌ జాబుల్లో ఎప్పుడు ఏం అంటారో తెలియదు.. ఉద్యోగం పరిమ్మెంట్‌ కానీ జీతం సరిపోదు.. మనసుకు మనీ పర్స్‌కు మధ్య బతకాలి..! చిన్నదో పెద్దదో ఈరోజుల్లో వ్యాపారం చేసుకోవడమే ఉత్తమం అని యువత భావిస్తున్నారని కొన్ని సర్వేలు సైతం చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news