బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆనంద్ కన్వెన్షన్‌ని నిర్మించారని పేర్కొన్నారు. అందులో మాజీ మంత్రి హరీశ్‌కు కూడా వాటాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే పేద ప్రజలను హరీశ్ అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
ఇదిలాఉండగా, ఇప్పటికే హైడ్రా హిమాయత్ సాగర్ జలశయం పరిధిలోని నిర్మాణాలను కూల్చి వేసే పనిలో బిజీగా ఉంది. జల మండలి,రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్ పరిధిలోని కొందరు సినీ,రాజకీయ ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు,ఇతర నిర్మాతలతో పాటు అక్రమంగా నిర్మించిన సాధారణ ప్రజల ఇళ్లు కూడా కూలగొట్టే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే కాంగెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాగా, హరీశ్ రావుపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఇంకా స్పందించకపోవడం గమనార్హం.