భారతీయులకి షాక్ ఇచ్చిన…అమెరికా సుప్రీంకోర్టు..!!!

-

అమెరికాలో నివసించే వలసదారులకు ఇచ్చే  శాశ్వత పౌరసత్వ గుర్తుంపు గ్రీన్ కార్డు. అయితే ఈ గ్రీన్ కార్డు పొందడానికి అక్కడి వలసదారులు ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తూ ఉంటారు. గతంలో ఉన్న నియమనిభంధనల ప్రకారం గ్రీన్ కార్డ్ రావలంటే పెద్దగా వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అమెరికాలో స్థిరపడుతున్న ఎన్నారైలు అధిక సంఖ్యలు ఉండటంతో ప్రతీ ఏటా గ్రీన్ కార్డ్ విషయంలో ప్రభుత్వాలు కొత్త కొత్త షరతులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే…

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిభందనలు మరింత కటినంగా మారిపోయాయి. తాజాగా ఈ గ్రీన్ కార్డ్ పొందాలంటే ఈ హక్కులని వదులుకోవాలంటూ ప్రభుత్వం షరతులు విధించడంతో గ్రీన్ కార్డ్ పొందే అర్హత గలవాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఇంతకీ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన షరతులు ఏంటంటే..అమెరికాలో ఉంటున్న వలసదారులు  మెడికల్ ఎయిడ్ , ఫుడ్ స్టాంప్స్, ఇంకా హౌసింగ్ వోచేర్స్ మొదలగు ప్రయోజనాలను పొందుతుంటారు…అయితే…

 

ప్రభుత్వం కల్పించే ఈ సదుపాయాలు పొందిన వారికి గ్రీన్ కార్డ్ ఇచ్చే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అయితే కొంతమంది ఆర్ధిక పరిస్థితులకి  అనుగుణంగా కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉందని అది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో అంశమని తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడంతో అమెరికాలో ఉంటున్న వలసదారులు గ్రీన్ కార్డుపై ఆశలు వదులుకోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా ప్రకటించింది.

 

ముఖ్యంగా ఈ గ్రీన్ కార్డ్ ల విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో భారతీయులకి షాక్ అనే చెప్పాలి ఎందుకంటే , అమెరికాలో అత్యధిక వలస వాసులు గానీ, గ్రీన్ కార్డ్ పొందే వారిలో ముందు వరుసలోగాని భారతీయులే ఉన్నారు. ఈ తాజాగా నిర్ణయం భారతీయ ఎన్నారైలపై తీవ్ర మైన ప్రభావం చూపెడుతుందని అంటున్నారు నిపుణులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news