కొంపలు ఆర్పేస్తున్న సోషల్ మీడియా…!

-

సోషల్ మీడియా; ఈ రోజుల్లో దీనితో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వాడకం అనేది ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతీ ఒక్కటి కూడా నేడు ఎక్కువగా వాడుతూనే ఉన్నారు. వ్యాపార, విద్య, ఉద్యోగ, స్నేహం, కుటుంబాలు ఇలా ఎన్నో అవసరాలు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి.

విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సోషల్ మీడియా వాడకం గత ఆరేళ్ళు గా మన దేశంలో ఎక్కువైపోయింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంటే అన్నారు అంటారు గాని మొగుడుకి వంట వండలేని పెళ్ళాం, సోషల్ మీడియా కోసం రకరకాల వంటకాలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అది అక్కడి వరకు ఆగితే బాగానే ఉంటుంది గాని కుటుంబాన్ని మర్చిపోవడమే ఇక్కడ బాధాకరమైన విషయం.

సోషల్ మీడియా లైకుల కోసం కష్టపడే జనం, కుటుంబ సభ్యుల కోసం మాత్రం కష్టపడే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. టిక్ టాక్ గొడవల వలన భార్యలను భర్తలు చంపేస్తున్నారు. ఫేస్బుక్ స్నేహాలు పిల్లలను నాశనం చేస్తున్నాయి. పెళ్లి అయిన ఆడవాళ్ళు భర్తలను వదిలేసి ఫేస్బుక్ మీద దృష్టి పెట్టె పరిస్థితి. సలహా ఇచ్చిన వాడిని నువ్వు చూస్తున్నావా అనే ఎదురు ప్రశ్న ఒకటి.

నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకు చెప్తూ కుటుంబ పరువు తీస్తూ నానా రకాల యాగీలు చేస్తున్నారు. శారీరక సుఖం కోసం ఫేస్బుక్, డబ్బుల కోసం ఫేస్బుక్, ఇతరత్రా కార్యక్రమాల కోసం ఫేస్బుక్, ఆత్మీయ సమావేశాల మాటున జరుగుతున్న ఘోరాలు దారుణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా చేసే మంచి కన్నా ముంచడమే ఎక్కువైంది అనేది వాస్తవం.

వాస్తవాలు తట్టుకోలేని వాడు మనిషి. సోషల్ మీడియా అనేది మీకు ఒక్క మేలు చేస్తే వంద నష్టాలు చేస్తుంది. మీ జీవితాలు నిలువునా నాశనం అవుతుంది. ముందు నవ్వించినా తర్వాత కవ్వించి కాటేస్తున్నాయి. దీనితో కనపడకుండా చితికిపోతున్న బతుకులు ఎన్నో. టిక్ టాక్ కోసం షాపింగ్ చేయలేదని భర్త మీద అలిగి వెళ్ళిపోయే దౌర్భాగ్య౦ నేడు ఉందంటే పరిస్థితి ఎంత చండాలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

చదువులు, కుటుంబాలు, వ్యాపారాలు, మంచి, మానవత్వం వదిలేసి సోషల్ మీడియా కోసం సమయం వెచ్చిస్తూ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాస్తవాలు చెప్తే చెప్పిన వాళ్ళ మీద అరిచి కేసులు కూడా పెట్టె వరకు పరిస్థితి వెళ్ళింది. సోషల్ మీడియా వలన లాభాలు లేవా అంటారు. ఉన్నాయి… సరిగా వాడుకునే వాడికి ఉన్నాయి గాని, మీ ఇష్టం వచ్చినట్టు జల్సాలకు, విలాసాలకు, మోసాలకు, నాశానాలకు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news