Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం: ఎంపీ సంతోష్ కుమార్

-

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.న్యూ ఇయర్ వేళ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బంజారా హిల్స్ పార్క్‌లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

రావి, చింత,మర్రి వంటి మొక్కలను నాటితే అవి తొందరగా పెరుగుతాయి .అంతేకాకుండా వివిధ జాతుల జంతువులకి, పక్షులకి ఆశ్రయం కల్పిస్తాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి సాధించిందని తెలిపారు.దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకుల మొదలుకొని సామాన్య ప్రజల వరకూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు అనుకూలమైన ,స్థిరమైన వాతావరణం సృష్టించడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమని నిర్వాహకులు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news