Prabhas : ‘సలార్’ సక్సెస్ పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. డార్లింగ్స్ అంటూ..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. సలార్ సినిమా మొదటి రోజు 178.7 కోట్లు వసూలు చేయగా ఇప్పటివరకు దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. బాహుబలి 2 తర్వాత అంత పెద్ద సక్సెస్ సాధించడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాహుబలి పార్ట్ వన్ తర్వాత బాహుబలి పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నట్టు ఇప్పుడు అభిమానులు సలార్ పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు. సలార్ సక్సెస్ గురించి చిత్ర యూనిట్ ఇదివరకు మాట్లాడగా తాజా ప్రభాస్ ఈ చిత్రం హిట్ కావడం గురించి స్పందించాడు.

సలార్ చిత్రంలోని ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. నేను ఖాన్సార్ భవిష్యత్తుని నిర్ణయిస్తాను .మీరు రిలాక్స్ గా కూర్చొని న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి. సలార్ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి, మూవీని మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్స్ డార్లింగ్స్ అని పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రభాస్ ఇలా మూవీ సక్సెస్ పై పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news