హైదరాబాద్ లో వరుడు అదృశ్యం.. రెండు రోజుల్లో పెళ్లి ఉండగానే!

హైదరాబాద్ పరిధి లోని.. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరుడు ఆదృశ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఎస్ ఆర్ నగర్ పరిధిలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు ఆదృశ్యం అయ్యాడు.. జంగారెడ్డి గూడెం మండలం బుట్టాయిగూడెం నికి చెందిన సత్యనారాయణ గుప్తా అలియాస్ నాని (30) మిస్సింగ్ అయ్యాడు.

నగరంలో ఓ ప్రైవేట్ బ్యాంకు లో పనిచేస్తున్న KPHB కాలనీ లో ఉంటున్నాడు నాని. అతనికి ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 13 న రాత్రి 9:30 కేపీహెచ్బీ కాలనీలో బస్సు ఎక్కిన అతను బస్సు దిగిపోయి ఉన్నట్లు గుర్తించారు బంధువులు. ఆ తర్వాత ఆచూకీ లేకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఆత్మ హత్య చేసుకున్నాడా ? లేక ఇంకా ఏదయినా జరిగిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.