ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే జాబితాలో ప్రధాని మోదీ ఎన్నో స్థానమో తెలుసా..?

వ్యక్తుల పనితీరు, వ్యక్తిత్వం వారు చేస్తున్న సామాజిక సేవల వల్ల ప్రజల్లో ఆరాధన భావం పెరగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులను, క్రీడాకారులను, సినిమా నటులను ప్రజలు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అయితే ప్రపంచంలో ఎవరి ఎక్కువగా ఆరాధిస్తారనే విషయం ప్రజలకు కాస్త ఆసక్తిగా ఉంటుంది.

ఈ విషయంపై యూ గవ్ డేటా అనలిటిక్స్ కంపెనీ ఓ సర్వే నిర్వహించింది. 38 దేశాల్లోని 42 వేల మందిని సర్వే చేసి యూ-గోవ్‌ ఫలితాలను వెల్లడించింది. జాబితాలో ప్రధానమంత్రి 8 వస్థానంలో నిలిచారు. టాప్ 20లో ఇండియా నుంచి ప్రముఖ సినీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఈ జాబితాలో అమెరికా మాజీ అద్యక్షుడు బారక్ ఒబామాను ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఉన్నారు.

మహిళల జాబితా టాప్ 20లో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ తో పాటు ఇన్ఫోసిన్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి ఉన్నారు. బారక్ ఓబామా సతీమణి మిషెల్లీ ఒబాయా ఈ జాబితాలో తొలిస్థానంలో నిలువగా.. ఎంజెలీనా జోలీ, క్వీన్ ఎలిజబెల్ -2 తర్వాతి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.