గ్రూప్-1 ‘కీ’ రిలీజ్… ఎప్పుడంటే..?

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ‘కీ’ని రేపటి నుంచి ఈ నెల 17 వరకు TGPSC వైబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ‘కీ’ని సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపటి నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు ఈమెయిల్స్ ద్వారా పంపొచ్చని తెలిపారు. ఈ నెల 9న గ్రూప్-1 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉంటే… గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను TGPSC విడుదల చేసింది.అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news