సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీఎం చంద్రబాబు మంత్రులతో తొలిసారి సమావేశం అయ్యారు. పరిపాలనకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.అంతేకాకుండా పాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్న పరిస్థితి, ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు.
జగన్ నాశనం చేసిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక బాధ్యత కావాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇక.. ఓఎస్డీలు, పీఎలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రులతో అన్నారు. గత ప్రభుత్వంలో కళంకిత మంత్రుల వద్ద పని చేసిన వారు ఇప్పుడు మీ వద్ద దూరే ప్రయత్నం చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని మీ దరి చేరనివ్వద్దని సూచించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్ధత బట్టి రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని ,ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని మంత్రులతో చెప్పారు.