తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం నేడు హైదరాబాద్ కు చేరుకుంది. యాసంగి తో పాటు వాన కాలంలో అధనంగా కొనుగోలు చేసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు, ఎంపీలు ఢిల్లీ కి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు జగదీశ్ రెడ్డీ పలువురు మంత్రులు అలాగే టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, రాజ్యసభ పక్ష నేత నామా నాగేశ్వర రావు తో పాటు పలువురు ఎంపీలు ఈ నెల 18 న ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీకి చేరిన తర్వాత దాదపు రెండు రోజుల పాటు మంత్రుల బృందానికి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లభించలేదు. రెండు రోజుల తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ లభించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ అయిన వరి ధాన్యం కొనుగోలు అంశం పై క్లారిటీ రాలేదు. దీంతో కేంద్రం నుంచి హామీ లభించకుండానే మంత్రులు, ఎంపీలు హైదరాబాద్‌కు చేరారు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి పై టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అందుకోసం త్వరలోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది.