టీనేజ్‌లో పెరుగుతున్న డిప్రేషన్‌.. పేరేంట్స్‌ ఈ విషయాలు ముందే గుర్తించాలి

-

లైఫ్‌లో డిఫ్రెంట్‌ స్టేజేస్‌ ఉంటాయి. ప్రతి దశ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా టీనేజ్‌ చాలా బాగుంటుంది. ఈ ఏజ్‌లోనే కొత్త పరిచయాలు స్టాట్‌ అవుతాయి. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేకపోతాం. చూసినవి అన్నా కావాలనిపిస్తుంది. శరీరంలో మార్పులు వస్తాయి. 13 నుంచి 19 ఏళ్ల లోపు వయసును టీనేజ్‌గా చెబుతారు. ఈ సమయంలో వారిలో శారీరక, మానసిక ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. వారి ఆలోచనల్లో మార్పులు కూడా అధికంగానే ఉంటాయి. హార్మోన్ల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. భయాలు, అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతీదీ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. చాలామంది టీనేజీ యువత డిప్రెషన్ బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిలో డిప్రెషన్ లక్షణాలు ముందే గుర్తిస్తే పిల్లలను కాపాడుకోవచ్చు. మీరు చూసే ఉంటారు.. హీరో విజయ్‌ ఆంటోని కుమార్తె కూడా డిప్రెషన్‌ వల్లనే సూసైడ్‌ చేసుకుంది.

Teen Depression - Apollo Hospitals Blog

ఒత్తిడిని తట్టుకునే శక్తి లేక టీనేజీ పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచిస్తున్నారు. అందుకే వారి ప్రవర్తనలో ఏమైనా తేడా వస్తే తల్లిదండ్రులే చొరవ చూపాలి. వాళ్లకు ఉన్న ఆందోళన, అనుమానాలను పరిష్కరించాలి. టీనేజీలో ఉన్న పిల్లలు సరిగా ఆలోచించలేరు. మొండితనంగా ఉంటారు. తాము అనుకున్నది జరగకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. మానసికంగా కృంగిపోతారు. తోటి వారితో పోల్చుకుంటారు. అందంగా లేమని, రంగు తక్కువగా ఉన్నామని, సన్నగా ఉన్నామని, లావుగా ఉన్నామని, మంచి డ్రెస్సులు లేవని ప్రతి దాని గురించి బాధపడతారు. ఎవరైనా తమకన్నా మెరుగ్గా కనిపిస్తే ఆత్మన్యూనతకు గురవుతారు.

The Do's and Don'ts of Helping a Teen With Depression

ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతున్న పిల్లలను తల్లిదండ్రులే గుర్తించాలి. వారిని కాపాడుకోవాలంటే తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం. డిప్రెషన్‌తో బాధపడుతున్న పిల్లలను గుర్తిస్తే వారికి సకాలంలో చికిత్స అందించి కాపాడుకోవచ్చు. మీ పిల్లలు ఉన్నట్టుండి ఏడవడం, నలుగురితో కలవలేకపోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టు కనిపించినీ మీరు తేలిగ్గా తీసుకోవద్దు. వారి దగ్గర కూర్చుని కారణాలు తెలుసుకోండి. మాటల్లో నిరాశ, నిస్సృహాలు కనిపిస్తుంటే మీరు వారికి మద్దతుగా నిలవండి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం, వస్తువులు విసిరి కొట్టడం, ఎదుటివారిపై అరవడం వంటివి చేస్తున్న కూడా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఆహారం తినకపోవడం కూడా డిప్రెషన్ లక్షణమే. వాళ్లకు వాళ్లే ఏదో ఒక హాని చేసుకుంటారు, ఆలోచనల్లో తేడా వస్తుంది. ఇలాంటివి మీ పిల్లల్లో గుర్తిస్తే..వారు డిప్రెషన్ బారిన పడ్డారని మీరు గుర్తించాలి.

ఎక్కువగా నిద్రపోతున్న లేదా నిద్ర చాలా వరకు తగ్గిపోయినా రిస్కే. ఇలాంటి పిల్లలకు తల్లిదండ్రులే అండగా నిలవాలి. మీ పిల్లలు తప్పు చేసిన సరే వారిని మందలించడం, విపరీతంగా కోప్పడడం, అసహ్యించుకోవడం, కొట్టడం అస్సలు చేయకండి. ఇది వారిలో ఆత్మహత్య ఆలోచనలను తెస్తుంది. కాబట్టి ముందు వారిని దగ్గరకు తీసుకోండి. ఊరటగా మాట్లాడండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య స్నేహంభావం కచ్చితంగా ఉండాలి. పిల్లలు ఏదైనా సరే తల్లిదండ్రులకు మనసు విప్పి చెప్పేలా ఇంట్లోని పరిస్థితులు ఉండేలా చూసుకోండి. మీరు వాళ్ల ముందే మీ పార్టనర్‌తో గొడవపడితే వాళ్లు ఇంకా ఆందోళనకు గురవుతారు. బయట స్నేహాలను ఎంచుకుంటారు. అది చివరకు ఎటైనా దారితీయొచ్చు. ఎంత బిజీ అయినా కూడా మీ పిల్లల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం కొంత సమయాన్ని కేటాయించండి.

Read more RELATED
Recommended to you

Latest news