వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి ఇప్పటి జగన్ వరకు వారి ఫ్యామిలీకి ఉన్న అభిమాన ఆదరణ గురించి చెప్పాల్సిన పనే లేదు. తెలంగాణలో కూడా వీరికి అభిమానులు ఉన్నారు. కాగా తెలంగాణ కంటే కూడా ఏపీలో ప్రతి ఊరిలో వీరికి ఆదరణ ఉందనే చెప్పాలి. ఆ ఆదరణే జగన్‌ను పార్టీ పెట్టేవరకు తీసుకొచ్చింది. ఇక ఇప్పడు ఏకంగా సీఎంను చేసే వరకు ఆయన ఎదిగారంటే దానికి కారణం ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణే అని చెప్పాలి. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఆయన బెస్ట్ సీఎంలలో నాలుగో స్థానంలో నిలిచారు.
ఇక దీంతో జగన్‌కు ఇక తిరుగే ఉండదని అంతా అంచనా వేశారు. ఇక జగన్ పాలన మరో రెండు లేదా మూడు టర్మ్‌ల వరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇందుకు తగ్గటే కూడా గతేడాది ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కూడా దేశంలోనే అత్యంత ప్రజాధరన కలిగిన సీఎంలలో జగన్‌కు నాలుగో స్థానం దక్కింది. అయితే ఈ సారి ఆ స్థానం దిగజారిపోయింది. ఇంకా చెప్పాలంటే కనీసం ఆయన టాప్ 10లో కూడా లేరు.
గతేడాది లాగే సేమ్ ఈ ఏడాది కూడా జగన్ పాలనకు సంబం ధించి ఇండియా టుడే నిర్వహించిన ది మూడ్ ఆఫ్ దినేషన్ సర్వేలో జగన్ ఏకంగా తన స్థానాన్ని కోల్పోవడమే కాకుండా కనీసం టాప్ 10లిస్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. గతేడాది కంటే ఈ సారి ఏకంగా 11 శాతం ప్రజాదరణ కోల్పోయి జగన్ తన ప్రభావాన్ని తగ్గించుకున్నారుని తెలుస్తోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా ఈ టాప్ 10 లిస్టులో పేరు దక్కించుకోలేకపోయారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరికి ఆదరణ తగ్గిపోతోందనే చెప్పాలి.