ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై మంత్రి అమర్‌నాథ్ ఫైర్‌

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై అనకాపల్లిలో మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. హౌసింగ్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరిపించాలని పీలా గోవింద్ ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తనపై చేసిన భూ ఆరోపణపై మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడివి, నా గురించి మాట్లాడడానికి నీ బ్రతుకేంటి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నువ్వు సారా తాగి పెరిగితే, తాను పాలు తాగి పెరిగానంటూ మంత్రి పీలా గోవింద్‌పై ధ్వజమెత్తారు. నీ పేరే కబ్జా గోవింద, నీ ప్రభుత్వంలోనే నీపై 420 కేసు నమోదయిందంటూ ఆయన విమర్శించారు. పీక తెగినా తాను అవినీతికి పాల్పడను అని మంత్రి వ్యాఖ్యానించారు. సీఐడీ కాదు సీబీఐ విచారణకైనా నేను రెడీ అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

AP Minister Challenge: విస్సన్నపేట భూములపై చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్  సవాల్... | AP Minister Gudivada Amarnath Challenge to TDP Chief Chandrababu  naidu Visakhapatnam Andhrapradesh Suchi

ఇదిలా ఉంటే.. క‌న్నుల‌కింపైన శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వాన్నిప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌త్య‌క్షంగా తిల‌కించారు. జిల్లా కేంద్ర స‌హ‌కార బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కుటుంబం ఆశీనులై ఉత్స‌వాన్ని తిల‌కించింది. ఆయ‌న‌తోపాటుగా రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సి డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు ఇత‌ర ప్ర‌ముఖులు, అధికారులు సైతం ఇక్క‌డినుంచే ఉత్స‌వాన్ని తిల‌కించారు. ఉత్స‌వానికి అమ్మ‌వారి సిరిమానును, ఇత‌ర ర‌థాల‌ను ముందుగానే ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకురావ‌డంతో, సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమయ్యింది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్ల‌ను ఆర్అండ్‌బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మున్సిప‌ల్ సిబ్బంది ప్ర‌త్యేక పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, పలు చోట్ల తాత్కాలిక మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేశారు. త్రాగునీటి స‌దుపాయం క‌ల్పించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news