గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ కు బంపర్ ఆఫర్ … !

-

తమిళనాడుకు చెందిన యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ కు స్థానికంగా జరిగే లీగ్ లలో తన సత్తా చాటి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ దృష్టిలో పడ్డాడు, అనంతరం ఐపీఎల్ లో గత రెండు సీజన్ ల నుండి ఆడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ ప్రదర్శన కారణంగా ఇండియా ఏ లోనూ చోటు దక్కించుకుని ఎమెర్జింగ్ ఆసియా కప్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్ ను ఇంగ్లాండ్ క్రికెట్ తన దేశంలో జరిగే ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ అయిన LV ఇన్సూరెన్సు 4 డే మ్యాచ్ ల కోసం తీసుకుంది. ఈ లెవెల్ లో టాప్ లో ఉన్న సర్రే జట్టు ఇతన్ని ఎంపిక చేసుకోవడం విశేషం, ఈ జట్టులో కీలక ప్లేయర్ లు అయిన విల్ జాక్స్, లాతమ్, కర్రను మరియు ఇతర ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వెల్లిపోవడం వలన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ కు అవకాశం లభించింది.

మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఇండియా పేరును నిలబెడతాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news