“వన్ నేషన్ – వన్ ఎలక్షన్” బిల్లు వస్తుందా ?

-

ఈ మధ్యనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంతో వాడి వేడిగా జరిగి ముగిశాయి . ఈ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను తీసుకువచ్చింది, కొన్నిటికీ సభ్యులు అందరూ మద్దతు తెలపగా .. కొంటికీ ఎప్పటిలాగే విముఖత ఎదురైంది. ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రత్యేక సమావేశాలు అంటూ జరపడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందట. మాములుగా అయితే ఇప్పటి వరకు సంవత్సరంలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈ సమావేశాలను నిర్వహించడం జరుగుతూ వస్తోంది. కానీ ఈ ప్రత్యేక సమావేశాలు జరగడం ఏమిటంటూ అందరూ సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇక ఈ సమావేశాలను నిర్వహించి అందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లును కూడా తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతున్నాయంటున్నారు. ఒకవేళ ఈ బిల్లును తీసుకువస్తే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.

అయితే ఇప్పుడు అధికార పక్షము ఏ విధంగా ఈ సమావేశాల విషయంలో ముందుకు వెళుతుంది… విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందా లేదా ఏకపక్షముగా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news