మరికొన్ని రోజులలో లోక్సభ ఎన్నికలు ఆసన్నం అవుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడి.. దేశ వ్యాప్తంగా తీరిక లేకుండా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం ఉదయం ద్వారకలోని బెట్ ద్వారక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ద్వారకలోని పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.ఇందులో భాగంగా ద్వారకాలో ఆయన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన “సుదర్శన్ సేతును ” ప్రారంభించారు.
అనంతరం సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని ఆయన సందర్శించారు. ‘నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం అని అన్నారు. నేను ఆధ్యాత్మిక వైభవం, పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను అని తెలిపారు. శ్రీ కృష్ణుడు మనందరినీ అనుగ్రహించాలి అని కోరుకుంటున్నా’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.