గుజ‌రాత్ సైంటిస్టులు.. క‌రోనా గుట్టు ర‌ట్టు చేశారు..!

-

క‌రోనాపై జ‌రుగుతున్న పోరాటంలో గుజ‌రాత్ సైంటిస్టులు ఒక అడుగు ముందుకు వేశారు. ఆ వైర‌స్‌కు సంబంధించిన జీనోమ్‌ను పూర్తిగా సీక్వెన్సింగ్ చేయ‌డంలో వారు విజ‌యం సాధించారు. ఈ మేర‌కు గుజ‌రాత్‌లోని గుజ‌రాత్ బ‌యోటెక్నాల‌జీ రీసెర్చ్ సెంట‌ర్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో సైంటిస్టుల విజ‌యం ప‌ట్ల అటు గుజ‌రాత్ సీఎం కార్యాల‌యం వారిని అభినందించింది. గుజ‌రాత్ సీఎంవో ట్విట్ట‌ర్‌లో ఆ సైంటిస్టుల‌ను పొగుడుతూ ట్వీట్ చేసింది.

Gujarat scientists successfully completed sequencing of corona virus genome

క‌రోనా వైర‌స్ ఉన్న రోగుల నుంచి సేక‌రించిన రక్త న‌మూనాల‌ను విస్తృతంగా ప‌రిశోధ‌న చేయ‌డం ద్వారా ఆ సైంటిస్టులు ఆ వైర‌స్‌కు సంబంధించిన జీనోమ్‌ను పూర్తిగా సీక్వెన్సింగ్ చేశారు. దీంతో ఆ వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డం చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. అయితే ప్ర‌స్తుతం వారు ఇంకా ప్ర‌యోగాలు కొన‌సాగిస్తున్నందున‌.. వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌చ్చేందుకు కొంత కాలం ప‌డుతుంది. ఇక క‌రోనా వైర‌స్‌పై ఈ ఘ‌న‌త సాధించిన తొలి రాష్ట్రంగా గుజ‌రాత్ పేరుగాంచింది.

కాగా ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) కూడా మ‌రోవైపు ప‌రిశోధ‌న‌లు చేసి.. మ‌న దేశంలో రెండు జాతుల‌కు చెందిన గ‌బ్బిలాల్లోనూ క‌రోనా వైర‌స్ ఉంటుంద‌ని నిర్దారించారు. అయితే గ‌బ్బిలాల‌ను నిరంత‌రం ప‌రిశీల‌న‌లో ఉంచ‌డం వ‌ల్ల వాటి ద్వారా భ‌విష్య‌త్తులో ఇలాంటి మ‌హమ్మారి వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చని ఐసీఎంఆర్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news