ఐపీఎల సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్‌ను డేవిడ్ మిల్లర్ ఒంటి చేత్తో గెలిపించాడు. కేవలం 38 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా 40 పరుగులతో రాణించాడు.
రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్‌కాయ్ తలా వికెట్ సాధించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 56 బంతుల్లో బట్లర్ 89 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్ 47 పరుగులతో రాణించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, సాయికిషోర్, యశ్ దయాల్, హార్ధిక్ పాండ్యా తలా వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.