గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగాణ అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే, తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు పనిచేయవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంకా, తెలంగాణలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. 28, 29వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఓయూ పరిధిలో జరగాల్సిన ఈ ఎన్నికలు మరో రోజున నిర్వహించనున్నారు. మొత్తానికి గులాబ్ తుఫాన్ ప్రభావం ఒరిస్సాను దాటి ఆంధ్ర చేరి, ఇప్పుడు తెలంగాణను కూడా వణికిస్తుంది.