Breaking : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుపాకీ కలకలం

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో తుపాకీ కలకలం రేపుతోంది. మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి తుపాకీతో తన కుటుంబ సభ్యులను కాల్చడానికి ప్రయత్నించాడు. బావుసాయిపేటకు చెందిన నేవూరి హునుమంతు.. తన కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో అదికాస్తా గొడవకు దారితీసింది. దీంతో కోపాద్రిక్తుడైన హునుమంతు తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్పులు జరపడానికి యత్నించాడు.

 

భయాందోళనకు గురైన వారు ప్రాణాలు అరచేతపెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా, హనుమంతు గతంలో జనశక్తి సానుభూతిపరుడిగా పనిచేశాడు. జనశక్తి డంపు చేసే ఆయుధాల్లో ఒక ఆయుధాన్ని అతడు దాచుకున్నట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version