కెనడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తెలుగోడు..!!!

-

భారతీయుల ప్రతిభకు ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిన మనకి మనమే సాటి అని భారతీయులు తమ ఉనికిని చాటుతున్నారు. దేశం ఏదైనా అన్ని రంగాలలోనూ భారతీయుల సేవ, కృషి, కనిపడుతూనే ఉన్నాయి. విద్య, వైద్య, సాంకేతిక రంగాలలో మన భారతీయులు కనబరిచే ఆసక్తి వారి విజయం రూపం లో మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ మధ్యకాలం విదేశాలలో భారతీయులు రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు.

మొన్నటికి మొన్న బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి ఎంపిక అయిన విషయం విదితమే తాజాగా ఇప్పుడు కెనడా దేశంలో ఆల్బర్టా రాష్త్రానికి మౌలిక వసతుల మంత్రిగా గుంటూరు జిల్లాకి చెందిన పండా శివలింగ ప్రసాద్ నియమించబడ్డారు. శివలింగ ప్రసాద్ పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా విద్యాభాసం మొత్తం వియవాడలోనే జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత  ముంబై లో 16 ఏళ్ళు ఓ  ప్రముఖ కంపెనీ లో పనిచేశారు. ఆ తరువాత కెనడా లో ప్రముఖ ఆయిల్ కంపెనీ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు.స్థానికంగా ప్రజలలో ఎంతో మంచి పేరుతెచ్చుకున్న పండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.

 

ఈక్రమంలోనే సమాజ సేవ పై ఆసక్తి పండా ని రాజకీయం వైపుకు పయనించేలా చేసింది. గత ఏప్రియల్ లో జరిగిన ఎన్నికలలో రెండో సారి ఎమ్మల్యేగా గెలిచారు. పండా ప్రతిభని గుర్తించిన అధికార పార్టీ ఆయనకి మౌలిక వసతుల శాఖామంత్రిగా భాద్యతలు అప్పగించింది. తాజాగా పండా తన సొంత జిల్లా గుంటూరు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్టాన్ని ఆర్ధికంగా గాడిలో పెట్టడమే తనముందు ఉన్న సవాల్ అని తెలిపారు. కెనడా మంత్రిగా పండాని  నియమించడంతో  ఏపీ రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news