నవగ్రహాలలో గురు గ్రహం అత్యంత ప్రాధాన్యం కల గ్రహం. అతిపెద్ద గ్రహం. దీని ప్రభావం చాలా ఉంటుంది. అయితే కొంతమంది జాతకాలలో గురుగ్రహం దోషస్థానాల్లో ఉంటుంది. అదేవిధంగా గోచార ఫలితాలలో కూడా గురువు కొందరకి అనుకూలంగా ఉండడు. అటువంటి వారు ఈ దేవాలయం సందర్శిస్తే చాలు తప్పక గురువు దోషం తీవ్రత తగ్గుతుంది. అనుకూలంగా మారుతుంది అని పండితుల అభిప్రాయం. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడులో నవగ్రహలకు సంబంధించిన అతిపురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో గురువుది ఒకటి. అలంగుడి …తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంభకోణం నుండి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది బృహస్పతి /గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి. అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్ ఆలయానికి ప్రసిద్ది చెందింది. సందర్శకులు కుంభకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.
అలంగుడి చరిత్ర పవిత్ర స్థలమైన శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ఆపత్సహాయేశ్వరార్ గా పేరుగాంచిన శివుని విగ్రహం ఉంది. ఇక్కడ పార్వతీ దేవిని ఏలావర్కుళలి లేదా ఉమై అమ్మాయి అని పిలుస్తారు. ఒకప్పుడు అసురులు, దేవతలు “పాలకడలి” ని చిలకడానికి ప్రయత్నించారు. వారు అమృతం కోసం ‘వాసుకి’ అనే పాముని ‘మందర’ పర్వతానికి తాడువలె చుట్టి లాగారు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు పాము వదలిన విషాన్ని మింగాడు. అందువలన, శివుడు ఆ విషంనుండి ప్రపంచాన్ని రక్షించడం వల్ల “ఆపత్సహాయేశ్వర్” అంటే “రక్షకుడు” అని అర్ధం, అలా ఈ ప్రదేశం ‘అలంగుడి’ గా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ శివుడిని పూజించడమే కాకుండా, దూరం నుండి, సమీపం నుండి అనేకమంది ప్రజలు బృహస్పతి లేదా గురు గ్రహం (జుపిటర్ గ్రహం) దోషాలను పోగొట్టుకోవడానికి పూజలు చేయడానికి, ప్రతి ఏటా గురువు మారినపుడు కూడా, పెద్ద సంఖ్యలో అలంగుడికి వస్తారు, వర్షాలు కురవడానికి, దురదృష్టాన్ని పారద్రోలడానికి ఎంతో భక్తీతో దేవుడిని ప్రార్ధిస్తారు.
సమీపంలోని ఆలయాలు అలంగుడిలోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు మిగిలిన 8 నవగ్రహ స్థలాలు లేదా ఆలయాలన్నీ, అంటే, తిరునల్లార్ (సాటర్న్ లేదా శని), కన్జనూర్ (వీనస్ లేదా శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సన్ లేదా సూర్యుడు), తిరువెంకడు (మేర్క్యూరి లేదా బుధుడు), తిరునాగేశ్వరం (రాహువు), తిన్గలూర్ (మూన్ లేదా చంద్రుడు), కీజ్పెరుమ్పల్లం (కేతువు) అలంగుడికి సమీపంలో ఉన్నాయి (జుపిటర్ లేదా గురు గ్రహం ఉన్న ఆలయం తొమ్మిది నవగ్రహ స్థలాలలో ఒకటి). అలంగుడి చేరుకోవడం ఎలా అలంగుడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణం ప్రధాన రైల్వే స్టేషన్, నీదమంగళం మరో రైల్వే స్టేషన్. యాత్రీకులు కుంభకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు. అలంగుడిలో వాతావరణం అలంగుడి లో వాతావరణం వేడిగా ఉంటుంది.
– కేశవ