కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో.. ఎవరికి వారు ఉప ఎన్నికలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని, కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ పాలన అంటున్న రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు సుఖేందర్ రెడ్డి.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యక్తిగతంగా రాజగోపాల్‌కు.. రాజకీయంగా బీజేపీకి అవసరమన్నారు సుఖేందర్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి కోసం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు సుఖేందర్ రెడ్డి. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందన్నారు సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే బీజేపీ ఉప ఎన్నికల వ్యూహం పన్నిందన్నారు సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి తీరని నష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు సుఖేందర్ రెడ్డి.