జనసేనతో పొత్తుపై GVL ఆసక్తికర వ్యాఖ్యలు

-

జనసేనతో బిజెపి పొత్తుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నామని.. పది నిరూపించుకోవడానికి రోజు ఫోటోలు దిగాల్సిన పనిలేదన్నారు. బిజెపి – జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం అనే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆప్షన్ తాము సిద్ధమని చెప్పారు. జనసేన, బిజెపి, టిడిపి కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలనే రెండవ ఆప్షన్ కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు.

వైసిపి, టిడిపిలను ఓడించడమే తమ లక్ష్యమని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఉంటుందని స్పష్టం చేశారు. బారసత్వ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకమని అన్నారు. విశాఖ – అరకు రోడ్డు విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రితో త్వరలోనే మాట్లాడుతానని అన్నారు. పద్మ అవార్డులు ఆంధ్ర ప్రదేశ్ కు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news