జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండవ రోజులో భాగంగా ఈపీఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మాణం ఆగిపోయిన వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాల్స్ ని పరిశీలించారు. టిడిపి హయాంలో 10 కోట్లతో నిర్మించే తలపెట్టిన ఈ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేసిందని ఆరోపించారు నారా లోకేష్.

నిర్మాణం ఆపేయడంతో కమ్యూనిటీ హాల్ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసి వాటిల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు అని బీసీలు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టిడిపి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్. విద్యా దీవెన, వసతి దీవెన అంటున్నారు తప్ప తమకు డబ్బు రావడంలేదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాదయాత్రలో లోకేష్ తో సమస్యలు చెప్పుకున్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? ఆఖరికి జిల్లాకు చెందిన అమర్ రాజా కంపెనీని సైతం ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రానికి తరిమేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news