ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. విశాఖ అభివృద్ధికి 390 కోట్లు విడుదల

ఢిల్లీః ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలో 390 కోట్ల రూపాయలతో ఈ.ఎస్.ఐ ఆసుపత్రి మంజూరు చేశామని తెలిపారు బిజేపి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహరావు. అధునాతన వసతులతో 400 పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని ప్రకటన చేశారు. అతి త్వరలోనే నిర్మాణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు బిజేపి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహరావు.

గత ఐదేళ్లలో మొత్తం 8 ఈ.ఎస్.ఐ ఆసుపత్రులు మంజూరు చేయనున్నట్లు తెలిపారుబిజేపి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహరావు. భూ కేటాయుంపులలో జాప్యం కారణంగా ఈ ఆసుపత్రుల నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. గుంటూరు లో 100 పడకల ఈ.ఎస్.ఐ నిర్మిస్తామని వెల్లడించారు.ఆసుపత్రి కి కూడా త్వరలోనే “ఈ.ఎస్.ఐ కా ర్పొరేషన్” ఆమోదం తెలుపుతుంద నీ స్పష్టం చేశారు బిజేపి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహరావు.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారమని చెప్పారు జీవీఎల్.