ఎంపీ అరవింద్ కు గవర్నర్ తమిళిసై ఫోన్.. దాడిపై ఆరా..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు గవర్నర్ తమిళిపై ఫోన్ చేశారు. ఇటీవల అరవింద్ పై జరిగిన దాడి చేసిన ఘటనపై ఆరా తీశారు. నిజామాబాద్ జిల్లా ఇన్సపల్లిలో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ దాడి గురించిన వివరాలను కేంద్ర హోం శాఖ దృషికి తీసుకెళ్తానని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఈ దాడి గురించి ఎంపీ అరవింద్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని ముందే తెలిసినా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని అరవింద్ గవర్నర్ కు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఇతర పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు అరవింద్ ఫిర్యాదు చేశారు.

ఈనెల 25 తేదీన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో ఉండగా… ఇన్సపల్లి దగ్గర అరవింద్ పై దాడి జరిగింది. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలకు గాయాలు కాగా.. అరవింద్ వాహనం ధ్వంసం అయింది. టీఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలే నాపై దాడి చేశారని అరవింద్ ఆరోపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి నాపై కుట్ర చేసి చంపాలని ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు అరవింద్. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం అరవింద్ పై దాడి చేసిన వారు పసుపు రైతులే అని చెబుతోంది.