హైద‌రాబాద్ ను ఆగం చేసిన‌ వాన‌..ఈ ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం..!

హైదరాబాద్ లో వ‌ర్షం బీభత్సం సృష్టించింది. న‌గ‌రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు కాలువ‌లు పొంగిపొర్లుతున్నాయి. టోలి చౌకి లోని నిజాం కాలనీ, మెహరాజ్ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. కృష్ణానగర్, వెంకటగిరిలో నిన్న రాత్రి వర్షానికి వరదలో వాహ‌నాలు కొట్టుకుపోయాయి.
అత్యధికంగా షేక్ పేట‌ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఐదు సెంటీమీటర్ల వర్షానికే సరూర్ నగర్ లో అనేక కాల‌నీలు నీట మునిగిపోయాయి.

గడ్డి అన్నారం డివిజన్ లోని పి ఎన్ టి కాలనీ, కోదండ రామ్ నగర్, కమల నగర్ లో వంద‌లాది ఇళ్లు నీటమునిగాయి. నిన్న రాత్రి కోదండ రామ్ నగర్ లో వరద నీటిలో ఆంబులెన్స్ చిక్కుకుపోవ‌డంతో వృద్ధురాలు మృతి చెందింది. లోతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీటినిజిహెచ్ఎంసి మాన్సూన్ బృందాలు తొల‌గిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ముంపు ప్రాంతాల ప్రజలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.