తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. రిట్ పిటిషన్ ధాఖలు చేసింది మల్లన్న భార్య మత్తమ్మ. హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర తరుపున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ ప్రద్యుమ్నా కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. చిలకల గూడ పీఎస్ లో నమోదైన కేసు పై తీన్మార్ మల్లన్న కు బెయిల్ ఇవ్వాలని కోరారు పిటిషనర్. పోలీసులు నమోదు చేసిన ipc 306, రెడ్ విత్ 511 సెక్షన్ల తొలగించాలని కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.
41A CRPC ప్రకారం పోలుసుల ఇచ్చిన నోటీసులకు హాజరయ్యమన్నారు పిటిషనర్… రెండు సారి ఇచ్చిన నోటీసులకు ఆరోగ్య సమస్య కారణం తో విచారణకు హాజరుకాలేక పోయామని పోలుసులకు రిప్లై ఇచ్చామని..పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. మూడో సారి అవకాశం ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని…. తీన్మార్ మల్లన్న పై 31 కేసుల్లో 14 కేసులు చిలకగూడా కేసు తరువాత కేసులు పెట్టారని కోర్టుకు పిటిషనర్ తరుపు న్యాయవాది వెల్లడించారు. అయితే… కింద కోర్ట్ లో బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉండడం వలన , మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలేమని తెలిపింది న్యాయస్థానం. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 14 కు వాయిదా వేసింది.