చలికాలంలో హెయిర్ కేర్ మస్ట్..ఈ నూనెతో తెల్ల జుట్టు దూరం..!

-

ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలనుకుంటారు. అందులో సందేహం లేదు. చలికాలంలో జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందమైన కురులని పొందడానికి జుట్టు సమస్యలు లేకుండా ఉండడానికి కచ్చితంగా జుట్టు పట్ల శ్రద్ధ వహించాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు.

చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. అయితే ఇలా కనుక చేశారంటే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. గోరింటాకు జుట్టుకి సహజసిద్ధమైన రంగుని ఇస్తుంది. ఐదు స్పూన్ల కొబ్బరి నూనె ని ఒక బౌల్లో వేసుకోండి. దీన్ని కాసేపు పొయ్యి మీద పెట్టి మరిగించాలి.

ఇప్పుడు అందులో గోరింటాకు పొడి వేయండి తర్వాత దీనిని మీ జుట్టు అంతటికి కూడా బాగా పట్టించాలి గంటసేపు తర్వాత కుంకుడు కాయతో తలస్నానం చేయాలి. నల్లగా మీ జుట్టు వస్తుంది. జుట్టు తెల్లగా ఉన్నట్లయితే కొబ్బరి నూనె ఉసిరికాయ మిశ్రమాన్ని కూడా మీరు ఉపయోగించచ్చు. ఇది కూడా మీ జుట్టు ని నల్లగా మారుస్తుంది నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె లో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసి బాగా కలపండి ఒక గంట అయ్యాక ఈ పేస్ట్ ని తలకి పట్టిస్తే జుట్టు బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news