మళ్ళీ దాడికి సిద్దమైన హమాస్…ఇజ్రాయెల్ పై రాకెట్ ల దాడి!

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో హమాస్ మిలిటెంట్ ల మధ్య జరుగుతున్న యుద్దానికి నెల రోజులు పైగానే కావస్తోంది. కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ గాజా పై దాడులు చేస్తుండడంతో, హమాస్ కొంచెం వెనక్కు తగ్గింది అని చెప్పాలి. కొంచెం విరామం ఇచ్చి ఈ రోజు మళ్ళీ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై పక్క ప్లాన్ తో దాడులు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ ను కేంద్రంగా చేసుకుని రాకెట్ లను ప్రయిగించడం జరిగింది. కానీ అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇజ్రాయెల్ మీడియా ఇద్దరు మహిళలు గాయపడినట్లు తెలిపింది. ఎందుకంటే హమాస్ ప్రయోగించిన రాకెట్ లలో కొన్ని ఇజ్రాయెల్ వరకు చెరకును అక్కడే పడడంతో అంతగా నష్టం వాటిల్లలేదు.

ఇక హమాస్ తెలిపిన ప్రకారం ఇజ్రాయెల్ గాజా పై చేస్తున్న దాడులకు ప్రతిగానే ఈ దాడి చేశారట. మరి ఇది ముందు ముందు పెద్ద పెద్ద దాడులకు కారణం అవుతుందా ? లేదా ఇంతటితో సంసిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news