ముస్లింలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది : కేటీఆర్

-

కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ వీక్‌ క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news