దీపావళి వాస్తవంగా ఈ రోజు నుండి స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఈ రోజు రేపు మరియు ఆదివారం మూడు రోజులు ఇండియాలో చాలా ఘనంగా దీపావళిని జరుపుకుంటారు. అయితే దీపావళి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది టపాసులు మాత్రమే. ప్రతి ఒక్కరూ వారి కంటే మేమె ఎక్కువగా టపాసులు కొనాలి కాల్చాలి అంటూ పోటీ పడుతుంటారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో టపాసుల కాల్చడంపై కొన్ని నియమాలను సీపీ శాండిల్య పెట్టడం జరిగింది. సీపీ విధించిన నియమాల ప్రకారం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిధిలోని రోడ్లు, పబ్లిక్ ప్లేస్ లు రాత్రి 8 నుండి 10 మధ్య తప్పించి మిగతా సమయాలలో పరిమితికి మించి శబ్దం వచ్చే టపాసులు కాల్చడం కుదరదని తెలియచేశారు. ఈ విధంగా నవంబర్ 12 నుండి 15 వరకు ఉంటుందని తెలిపారు, ఒకవేళ రూల్స్ కనుక అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు శాండిల్య.
మరి కమిషనర్ చెప్పిన విధంగా ప్రజలు అమలు చేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే టపాసులు నైట్ అంతా కాల్చే యువతకు ఇవన్నీ వినబడవేమో ?